Thursday, 24 August 2017

Chithu Chithu La Gumma - Bathukamma Song Lyrics

చిత్తూ  చిత్తుల  బొమ్మ  శివుని  ముద్దుల  గుమ్మ 
బంగారు  బొమ్మ  దొరికేనమ్మో  వాడ లోన 
చిత్తూ  చిత్తుల  బొమ్మ  శివుని  ముద్దుల  గుమ్మ 
బంగారు  బొమ్మ  దొరికేనమ్మో  వాడ లోన……1

రాగి  బింద తీసుక  రమణి  నీళ్ళకు  వోతే 
రాములోరు  ఎదురయే  నమ్మో    వాడ లోన 
చిత్తూ  చిత్తుల  బొమ్మ  శివుని  ముద్దుల  గుమ్మ 
బంగారు  బొమ్మ  దొరికేనమ్మో  వాడ లోన…….2 
 
వెండి  బింద తీసుక  వెలది  నీళ్ళకు  వోతే 
వెంకటేశు డెదురాయే   నమ్మో    వాడ లోన 
చిత్తూ  చిత్తుల  బొమ్మ  శివుని  ముద్దుల  గుమ్మ 
బంగారు  బొమ్మ  దొరికేనమ్మో  వాడ లోన …….3
www.sakalam.org
 
బంగారు  బింద తీసుక బామ్మా  నీళ్ళకు  వోతే 
భగవంతుడెదురాయే   నమ్మో    వాడ లోన 
చిత్తూ  చిత్తుల  బొమ్మ  శివుని  ముద్దుల  గుమ్మ 
బంగారు  బొమ్మ  దొరికేనమ్మో  వాడ లోన ……..4
  
పగిడి బింద తీసుక పడతి  నీళ్ళకు  వోతే 
పరమేశు డెదురాయే   నమ్మో    వాడ లోన 
చిత్తూ  చిత్తుల  బొమ్మ  శివుని  ముద్దుల  గుమ్మ 
బంగారు  బొమ్మ  దొరికేనమ్మో  వాడ లోన ……..5
 
ముత్యాల  బింద తీసుక ముదిత  నీళ్ళకు  వోతే 
ముద్దుకృష్ణుడెదురాయే   నమ్మో    వాడ లోన 
చిత్తూ  చిత్తుల  బొమ్మ  శివుని  ముద్దుల  గుమ్మ 
బంగారు  బొమ్మ  దొరికేనమ్మో  వాడ లోన …….6

No comments:

Post a Comment

Okkokka Akshinthalu Bathukamma Song Lyrics

Okkokka Akshinthalu - Bathukamma Song Lyrics ఒక్కొక్క అక్షింతలు   గౌరమ్మ   ఒక్క మల్లె సారెలు   నిన్నుతలచి మా అన్నలు గౌర...