బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
నీ బిడ్డ పేరేంటి ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో వొచ్చాన్న పోడు ఉయ్యాలో
ఎట్లడ్డు చెల్లెలా ఉయ్యాలో ఎరడ్డమాయే ఉయ్యాలో
యేరు కు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డమాయే ఉయ్యాలో
తోటకు తొంబై ఉయ్యాలో తలుపు అడ్డమాయే ఉయ్యాలో
తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి సీలలు ఉయ్యాలో
వెండి సీలలందున ఉయ్యాలో వేలభద్ర చెట్టు ఉయ్యాలో
వేలభద్ర చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో
ఏడు మొగ్గల పట్టి ఉయ్యాలో తక్కెడ పట్టి ఉయ్యాలో
ముసలిది వణికింది ఉయ్యాలో ముత్యాల పట్టి ఉయ్యాలో
వయసుది వణికింది ఉయ్యాలో వయనల పట్టి ఉయ్యాలో
ఆ పట్టి ఈ పట్టి ఉయ్యాలో కలరాశి పోసి ఉయ్యాలో
Nee Bidda Perenti Uyyalo Bathukamma Song free Download


No comments:
Post a Comment